e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home హైదరాబాద్‌ స్ట్రెయిన్లతోనే బ్లాక్‌ పంజా

స్ట్రెయిన్లతోనే బ్లాక్‌ పంజా

స్ట్రెయిన్లతోనే బ్లాక్‌ పంజా
  • స్టెరాయిడ్స్‌, ఆక్సిజన్‌ వాడకున్నా బ్లాక్‌ఫంగస్‌
  • షుగర్‌ లేనివారిలోనూ కేసులు
  • గాంధీలో 20 నుంచి 25 శాతం బాధితులు

సిటీబ్యూరో, జూన్‌ 10 (నమస్తే తెలంగాణ) : కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుతుందనుకుంటే బ్లాక్‌ ఫంగస్‌ ఇప్పుడు వణికిస్తున్నది. కరోనా సోకి తగ్గిన వారిలో ఇది ప్రధానంగా కనిపిస్తోంది. తొలిదశలో విదేశాలకే పరిమితమై, మనదేశంలో కనిపించని ఈ ఫంగస్‌ రెండోదశలో పంజా విసురుతున్నది. ప్రాణాలను సైతం బలి తీసుకుంటోంది. కొంతమందికి వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత సోకుతుండగా, మరికొందరికి పాజిటివ్‌ ఉండగానే ఈ ఫంగస్‌ సమస్య తలెత్తుతున్నది. మొన్నటివరకు అధికంగా స్టెరాయిడ్స్‌ వినియోగం, ఆక్సిజన్‌పై ఎక్కువకాలం చికిత్స పొందడం, షుగర్‌ స్థాయిలు నియంత్రణలో లేకపోవడం వంటి ప్రధాన కారణాలతోనే ఈ బ్లాక్‌ ఫంగస్‌ సోకుతున్నట్లు చాలామంది వైద్యులు, అధ్యయనాలు, సర్వేలు వెల్లడించాయి. కానీ తాజా అధ్యయనంలో అవన్నీ బ్లాక్‌ ఫంగస్‌కు ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. అంతేకాదు ఆక్సిజన్‌, షుగర్‌ స్థాయిలు అధికంగా ఉన్నవారికే ఈ ఫంగస్‌ సోకుతుందన్న వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవని వైద్యనిపుణులు చెబుతున్నారు.

స్టెరాయిడ్స్‌ తీసుకోని వారికి బ్లాక్‌ ఫంగస్‌

  • కరోనా చికిత్స సమయంలో స్టెరాయిడ్స్‌ తీసుకోని చాలామంది రోగులు కూడా బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడుతున్నట్లు నమోదవుతున్న కేసుల ద్వారా తెలుస్తోంది.
  • అంతేకాదు ఆక్సిజన్‌ వరకు వెళ్లనివారితోపాటు ఇప్పటివరకు అసలు షుగర్‌(డయాబెటిక్‌) లేనివారికి కూడా ఈ ఫంగస్‌ సోకుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు.
  • ఎసింప్టమాటిక్‌, స్వల్ప లక్షణాలతో హోం ఐసొలేషన్‌లో ఉన్నవారు కూడా బ్లాక్‌ఫంగస్‌ బారిన పడుతున్నట్లు గాంధీ వైద్యులు వెల్లడించారు. స్టెరాయిడ్స్‌, షుగర్‌ లెవల్స్‌, ఆక్సిజన్‌ వాడకంతో బ్లాక్‌ ఫంగస్‌కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నారు.

గాంధీలో 20శాతం మందికి….

  • గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న బ్లాక్‌ఫంగస్‌ రోగుల్లో 20 శాతం మంది ఎలాంటి స్టెరాయిడ్స్‌ వాడనివారే.
  • అంతేకాదు పాజిటివ్‌ వచ్చినప్పుడు ఆక్సిజన్‌ వరకు వెళ్లకుండా స్వల్ప లక్షణాలతో హోం ఐసొలేషన్‌లో ఉన్నవారు కూడా ఉన్నారు.
  • షుగర్‌ సమస్యలు లేనివారు కూడా ఈ ఫంగస్‌ బారిన పడ్డారు.

స్ట్రెయిన్ల ప్రభావమే ప్రధాన కారణం

కరోనా వైరస్‌లో వస్తున్న కొత్త స్ట్రెయిన్‌ల ప్రభావమే బ్లాక్‌ఫంగస్‌కు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి స్టెరాయిడ్స్‌ వాడని వారు, ఆక్సిజన్‌పై చికిత్స తీసుకోనివారు, షుగర్‌ సమస్య లేనివారు, హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి కూడా ఈ బ్లాక్‌ ఫంగస్‌ సోకుతుంది. కరోనా మొదటిదశలో చాలామంది రోగులకు స్టెరాయిడ్స్‌ వాడాం. రోజుల తరబడి ఆక్సిజన్‌పై చికిత్స అందించాం. అప్పుడు ఏ ఒక్కరికి బ్లాక్‌ ఫంగస్‌ సోకలేదు. ఈ ఫంగస్‌ కేవలం సెకండ్‌వేవ్‌లోనే కనిపిస్తున్నది. అదికూడా కొంతమందిలోనే. అందరికీ ఏ రకం స్ట్రెయిన్‌ సోకిందో తెలుసుకోవడం కష్టం. బ్లాక్‌ ఫంగస్‌కు వైరస్‌లో వచ్చినే స్ట్రెయినే ప్రధాన కారణంగా అనిపిస్తున్నది. పూర్తి క్లారిటీ రావాల్సి ఉన్నది. -డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ దవాఖాన

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్ట్రెయిన్లతోనే బ్లాక్‌ పంజా

ట్రెండింగ్‌

Advertisement