హైదరాబాద్ : నేడు ఇందిరా పార్క్ చౌక్ ( Indira Park )వద్ద బీజేపీ పార్టీ(BJP) ఆధ్వర్యంలో రైతు హామీల సాధన దీక్ష(Rythu Diksha )చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంగళవారం 11 గంటల వరకు 24 గంటల పాటు నిర్వహించనున్న దీక్షలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని బీజేపీ ఆరోపించింది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరికి బోనస్ సమస్యలు పరిష్కరించాలంటూ దీక్ష చేపడుతున్నట్లు ఆ పార్టీ పేర్కొంది. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. కరెంట్, నీళ్లు, సాగుకు సాయం అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవేవి పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నదని ఆ పార్టీ ఆరోపించింది. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలు పరిష్కించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపడుతున్నామని దీనిని విజయంవంతం చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది.