మియాపూర్, నవంబర్ 3 : సార్ అంటే సకల జనుల సర్కార్ అని కుల మత ప్రాంత ధనిక బీద తేడా లేకుండా అందరినీ సమానంగా చూసేది తమ ప్రభుత్వమని విపప్ అన్నారు. అన్ని వర్గాల ప్రజాదరణతో ఎన్నికలలో మూడోసారి ఘన విజయం సాధిస్తామన్నారు. హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని హైదర్‌నగర్‌కు చెందిన మైనార్టీలు, ఏఎస్ రాజునగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హఫీజ్‌పేట్ డివిజన్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రతినిధులు, బీజేపీ , కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు డాక్టర్ ప్రభాకర్, శేఖర్ గౌడ్, నిమ్మల రామకృష్ణల ఆధ్వర్యంలో విప్ గాంధీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు శుక్రవారం విప్ గాంధీ తన నివాసంలో వారందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ కార్మిక , కర్షక చేనేత సహా ఎన్నో రంగాలకు తమ ప్రభుత్వం సంపూర్ణ చేయూతనిచ్చిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి పురోగతి కోసం పాటుపడిందని విప్ గాంధీ పేర్కొన్నారు. ఉచిత విద్య, వైద్యం, ఉపాధితో పాటు వెసులుబాట్లను కల్పించి ప్రజలందరి సంపూర్ణ పురోభివృద్ధికి బాటలు వేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఎన్నికలలో తమకు సంపూర్ణ మద్దతును ఇచ్చి మూడోసారి ఘన విజయాన్ని అందించాలని విప్ గాంధీ కోరారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా తాను అవినీతి రహితంగా కృషి చేసినట్లు, రాబోయే రోజులలో మరింతగా కృషి చేస్తాననిఇ విప్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల పార్టీ నేతలు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లిలో కారు గెలుపు ఖాయం
శేరిలింగంపల్లి, నవంబర్ 3: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కారు గెలుపు ఖాయమని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అధ్వర్యంలో గోపన్‌పల్లి ఆటో యూనియన్ నాయకులు దాదాపు 50 మంది శుక్రవారం ఎమ్మెల్యే గాంధీ సమక్షంలో బీఆర్ఎస్ చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేటర్లో మరెక్కడ లేనివిదంగా అభివృద్ది పనులు శేరిలింగంపల్లిలో చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రజలు అభివృద్దిని చూసి బీఆర్ఎస్ పార్టీ పట్ల అకర్షితులై పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రజ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఛైర్మన్ తూడి ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు నీరుడి గణేష్ ముదిరాజ్, శంకరి రాజు ముదిరాజ్, శ్రీనుపటేల్, రాగం జంగయ్య యాదవ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.