పక్షులను పంజరంలో బంధించకుండా స్వేచ్ఛగా తిరగనివ్వాలని పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పేటా) ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం ప్రియాంక మెహర్ అనే యువతి ఇలా వినూత్నంగా ప్రదర్శన ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించింది.
– కవాడిగూడ, మే 30
కవాడిగూడ, మే 30 : పక్షులను పంజరంలో బంధించకుండా స్వేచ్ఛగా తిరగనివ్వాలని పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పేటా) ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో సంస్థ ప్రతినిధులు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నాచౌక్లో ప్రియాంక మెహర్ అనే యువతి పంజరంలో పక్షి వేషధారణలో కూర్చున్నారు. దేశంలో 1960 వన్యప్రాణుల పరిరక్షణ చట్టాలు సరిగా అమలుకు నోచుకోవడం లేదని నిర్వాహకులు అధర్వ దేశ్ముఖ్, హిరాజ్ లాల్జనీ, రాధిక సూర్య వంశీ, ఎన్. ప్రియాంక మెహర్ పేర్కొన్నారు.
మూగ జీవాలు, పక్షులను బంధించడం వల్ల అవి పడే ఇబ్బందులను కండ్లకు కట్టినట్లు ప్రదర్శించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. వాటి రెక్కల నుంచి వీచే గాలిని అనుభూతిని చెందాలని అన్నారు. దేశీయ జాతుల పక్షులను పట్టుకొని వ్యాపారం నిర్వహించడాన్ని ప్రభుత్వం నిషేధించాలని అన్నారు.