సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో విలీనమైన 27 పురపాలికలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో కమిషనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన కొత్త జోన్లు, సరిళ్లలో పనుల చెల్లింపుల ప్రక్రియను క్రమబద్ధీకరిస్తూ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)ను విడుదల చేసింది. కమిషనర్ల ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ (ఫైనాన్స్) కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, విలీనమైన 27 పురపాలికలకు సంబంధించి దాదాపు రూ. 120 కోట్ల బిల్లుల చెల్లింపులన్నీ తాజా మార్గదర్శకాల ప్రకారం జరపాలని కమిషనర్లు స్పష్టత ఇచ్చారు.
మూడు విభాగాలుగా పనుల విభజన
గతంలో మంజూరై, వివిధ దశల్లో ఉన్న పనులను మూడు కేటగిరీలుగా విభజించి బిల్లుల చెల్లింపులకు మార్గదర్శకాలు ఖరారు చేశారు. పూర్తయిన పనులకుగానూ గతంలో మంజూరై, ప్రస్తుతం పూర్తయిన పనులకు సంబంధించి కొత్త జోన్లు, సరిళ్ల పరిధిలో తాజాగా బడ్జెట్ కేటాయింపులు పొందాల్సి ఉంటుంది. సంబంధిత ఏఈ, డీఈ, ఈఈలతో ధ్రువీకరణ పత్రాలు, పనుల ఫొటోలు సమర్పించి, జీహెచ్ఎంసీ-ఈఆర్పీ సాఫ్ట్వేర్ ద్వారానే బిల్లులు ప్రాసెస్ చేయాలని ఆదేశించారు.
కొనసాగుతున్న పనులను ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనులకు సంబంధించి కూడా కొత్తగా బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలి. వర్ మానిటరింగ్ సిస్టమ్ (డబ్ల్యూఎంఎస్)లో అనుమతులు పొందిన తర్వాతే చెల్లింపులు జరుగుతాయి. కాగా, ప్రారంభం కాని పనులకు సంబంధించి టెండర్లు పూర్తయి, ఇంకా ప్రారంభం కాని (గ్రౌండింగ్ కానిది) పనుల విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నారు. అటువంటి పనులన్నింటినీ రద్దు చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు చెల్లించిన ఈఎండీలను వెనకి ఇచ్చేసి, అవసరమైతే ఆ పనులకు మళ్లీ కొత్తగా మంజూరు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈఆర్పీ విధానం అమలు
జీహెచ్ఎంసీలో అమలవుతున్న ఈఆర్పీ విధానాన్ని కొత్తగా ఏర్పడిన 12 జోన్లు, 60 సరిళ్లకు విస్తరించినట్లు సర్యూలర్లో పేరొన్నారు. అధికారులు ఎవరూ ఈ నిబంధనలను అతిక్రమించకూడదని, క్షేత్రస్థాయిలో జోనల్ కమిషనర్లు, ఇంజినీర్లు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని కమిషనర్ కార్యాలయం ఉత్తర్వుల్లో పేరొన్నారు.