కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 27 : అసెంబ్లీ ఎన్నికలు మరో రెండ్రోజుల్లో జరుగనున్న నేపథ్యంలో కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్, జనసేన పార్టీలకు బిగ్ షాక్ తగిలింది. కేపీహెచ్‌బీ కాలనీ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మల మోహన్‌కుమార్, ఫతేనగర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రేమ్, అనిల్ సోమవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్, జనసేన పార్టీల నేతల మాయమాటలు నచ్చక.. ఆయా పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉన్నదన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, బీఆర్ఎస్ పార్టీ నేతలు పద్మారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు తదితరులున్నారు.
Ktr6