Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో గురువారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ట్రావెల్స్ ఆఫీసు మేనేజర్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు పాల్పడిన ముఠాను బీదర్ ఏటీఎం దొంగల ముఠాగా పోలీసులు తేల్చారు.
దొంగల ముఠాను పట్టుకునేందుకు బీదర్ పోలీసులు హైదరాబాద్‌కు వచ్చారు. పోలీసులను చూసిన దొంగల ముఠా.. తప్పించుకునేందుకు అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఓ ట్రావెల్స్ కార్యాలయంలోకి ప్రవేశించారు. పోలీసులపై కాల్పులు జరుపుతుండగా.. అక్కడే ఉన్న ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్‌కు బుల్లెట్లు తగిలాయి. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు కూడా బీదర్ పోలీసులతో పాటు దొంగల ముఠాను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. బీదర్‌లో గురువారం ఉదయం ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై దోపిడీ దొంగలు దాడి చేశారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. దాడి అనంతరం డబ్బు పెట్టెతో దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. అందులో సుమారు రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాడి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
ఇక దొంగలు తెలంగాణ వైపు తమ బైక్‌ను మళ్లించినట్లు బీదర్ పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో బీదర్ నుంచి హైదరాబాద్ నగరానికి గురువారం సాయంత్రం వరకు చేరుకున్నారు. అఫ్జల్ గంజ్ వద్ద దొంగలకు బీదర్ పోలీసులు తారసపడ్డారు. దీంతో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అఫ్జల్ గంజ్‌లో ఉన్న ప్రయివేటు ట్రావెల్స్ కార్యాలయంలోకి దొంగలు ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్‌కు గాయాలయ్యాయి.
ఇవి కూడా చదవండి..
KTR | ఫార్ములా ఈ కార్ రేస్.. ఈడీ విచారణలో కేటీఆర్ సమాధానం ఇదే..!
KTR | లైవ్‌లో లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమా..? సీఎంకు కేటీఆర్ సవాల్
Robbers | పట్టపగలే రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. ఏటీఎం వాహనంపై దాడిచేసి నగదు లూటీ
Encounter | బస్తర్ రీజియన్‌లో ఎన్కౌంటర్.. 12 మంది నక్సల్స్ హతం..!