BGUS | హైదరాబాద్ : ఈ నెల 27వ తేదీతో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో హైదరాబాద్ నగరం గణనాథుల విగ్రహాలతో కళకళలాడనుంది. వీధికో వినాయకుడిని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో లంబోదరుడికి పూజలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్లో గణనాథులను నిమజ్జనం చేయనున్నారు.
ఈ క్రమంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కీలక నిర్ణయాలు తీసుకుంది. గణనాథులను నిమజ్జనానికి తరలించే వాహనాలకు ధరలను నిర్ణయిస్తూ ఆర్టీఏ అధికారుల నుంచి ఆమోదం తీసుకుంది. ఈ ఏడాది 1.40 లక్షల గణేశ్ మండపాలను హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంటే ఆ స్థాయిలో వాహనాలు కూడా అవసరం. ఇందులో 30 నుంచి 40 శాతం గణనాథులను మూడు, నాలుగు రోజుల్లోనే నిమజ్జనం చేయనున్నారు. మిగతా వినాయకుడి విగ్రహాలను సెప్టెంబర్ 6న నిమజ్జనం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో గణనాథులను నిమజ్జనానికి తరలించే వాహనాలకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ధరలను ఖరారు చేసింది. ఆ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఇంతకు మించి అదనంగా వసూలు చేస్తే ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు.
ట్రక్కులు : రూ. 33 వేలు(ఇంధనం, బత్తా కలిపి)
హెచ్జీవీ ట్రక్కులు((1/12 tyres) : రూ. 4,500(ఇంధనం, బత్తా కోసం అదనంగా రూ. 500)
హెచ్జీవీ ఆరు టైర్ల వాహనం : రూ. 3 వేలు
ఎంజీవీ : రూ. 2 వేలు
ఎల్జీవీ : రూ. 1,500
టాటా ఏస్ : రూ. 1000