గౌతంనగర్, డిసెంబర్ 18 : రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలతోనే పేదలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గౌతంనగర్ డివిజన్, హిల్టాప్ కాలనీలోని షేక్ మైబూబ్ పాషా ఇంటిని బస్తీ దవాఖాన ఏర్పాటు కోసం మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్(ఎంఎస్ఎస్వో) ట్రస్టు చైర్మన్ మైనంపల్లి రోహిత్బాబు రూ.5లక్షలకు కొనుగోలు చేశారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే.. షేక్ మైబూబ్కు ఆ నగదును అందజేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలోనే బస్తీ దవాఖా నను ప్రారంభించి.. పేదలకు వైద్య సేవలందిస్తామని తెలిపారు.
తన స్వంత ఖర్చులతో పేదలకు వైద్యం అందిస్తామని, ఆపదలో ఉన్నవారికి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. దేశంలో రైతులు ఎదుర్కొం టున్న సమస్యలు పరిష్కారం కావాలంటే బీఆర్ఎస్తోనే సాధ్య పడు తుందన్నారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ట్రస్టు ద్వార నిరంతరం పేద లకు సేవలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్, బీఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, హిల్టాప్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయ కులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు