25 మందికి అవార్డులు అందజేసిన డీజీపీ మహేందర్ రెడ్డి
అభినందనలు తెలిపిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్
సిటీబ్యూరో, మే 31(నమస్తే తెలంగాణ): వర్టికల్స్‌లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు చెందిన 25 మంది పోలీసు అధికారులకు మంగళవారం డీజీపీ మహేందర్‌రెడ్డి అవార్డులను అందజేశారు.
వర్టికల్స్‌లో అధికారులు, సిబ్బందికి అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ప్రజలకు వేగవంతమైన పోలీసింగ్‌ను అందించిన అధికారులు, సిబ్బంది పని తీరును గుర్తించి అవార్డులను ఇవ్వడంతో అందరిలో ఉత్సాహం నింపింది. 2021కు సంబంధించిన ఈ అవార్డులను డీజీపీ అందజేశారు. ఈ అవార్డులను అందుకున్న ప్రతి అధికారిని సీపీ మహేశ్ భగవత్, అదనపు సీపీ సుధీర్‌బాబు, ఉన్నతాధికారులు అభినందించారు.