సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ ప్రమాణాలతో హెచ్ఎండీఏ మూడేండ్ల కిందట చేపట్టిన నియోపోలిస్ నేడు సుందర నగరంగా ఎదుగుతున్నది. ప్రణాళికాబద్ధమైన నిర్మాణ శైలి, మెరుగైన మౌలిక వసతులతో నియోపోలిస్ లే అవుట్‌ను కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించింది.
ఇందుకు అనుగుణంగానే హెచ్ఎండీఏ మౌలిక వసతులను కల్పిస్తున్నది. తాజాగా, ఆరు లైన్ల మెటల్ రోడ్లు పనులు చివరి దశలో ఉన్నాయి. సెంట్రల్ ల్యాండ్ స్కేపింగ్, వంపులు తిరుగుతూ సువిశాలమైన ఆరు లైన్లతో ఎంతగానో ఆకట్టుకునేలా ఈ రహదారులను తీర్చిదిద్దుతున్నారు.