ఉస్మానియా యూనివర్సిటీ, మే 23 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ (సీబీసీఎస్) ఎనిమిదో సెమిస్టర్ బ్యాక్లాగ్, బీఈ (నాన్ సీబీసీఎస్) నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని ఆయన సూచించారు.