BRS Protest | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టులకు నిరసనగా కొండాపూర్‌లో నిరసన
BRS Protest | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ హఫీజ్‌పేట్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
కొండాపూర్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ( BRS MLAs) అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ హఫీజ్‌పేట్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన ( BRS Protest ) చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు అల్లావుద్దీన్ పటేల్ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు రంగారావు, నవతా రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలతో రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీ రాజ్యాన్ని నడుపుతోందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడాన్ని యావత్ తెలంగాణ సమాజం గమనిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ వైఫల్యాలను అసెంబ్లీ లో ఎండగడుతారని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే లను అడ్డుకొని అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలను సైతం తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసేలా చేయడం హేయనియమన్నారు. సామాన్య ప్రజల భూములను కావాలనే 22-ఎ జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మమత, పారునంది శ్రీకాంత్, సంగారెడ్డి కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

