న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని సత్యానికేతన్‌లో పీజీ హాస్టల్(Delhi Hostel) బిల్డింగ్ కూలిన ఘటనలో ఢిల్లీ మున్సిపల్ శాఖ అయిదుగురు అధికారులపై సస్పెన్షన్ విధించింది. దక్షిణ జోన్ డిప్యూటీ కమీషనర్ రాకేశ్ కుమార్‌తో పాటు నలుగురు ఇంజినీర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. పీజీ హాస్టల్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకున్నది. 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. సూపరెంటెండింగ్ ఇంజినీర్ రన్వీర్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(బిల్డింగ్) లలిత్ కుమార్ గోయల్, అసిస్టెంట్ ఇంజినీర్(బిల్డింగ్) సునీల్ చౌహాన్, జూనియర్ ఇంజినీర్(బిల్డింగ్ ఆశిశ్ కుమార్ వేటు పడినవారిలో ఉన్నారు. ఢిల్లీ మున్సిపాల్టీకి చెందిన విజిలెన్స్ శాఖ సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చింది. విజిలెన్స్ ఆఫీరస్ నంద కిషోర్ ఆ దేశాలు ఇచ్చారు. పీజీ హాస్టల్ బిల్డింగ్ ఓనర్లను గుర్తించారు. గురుగ్రామ్‌కు చెందిన హరి రామ్ భన్సల్, ఆనంద్ భన్సల్, ఆజాద్ భన్సల్గా తెలిపారు.