జూబ్లీహిల్స్, డిసెంబర్ 29 : యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్ కానిస్టేబుల్ దోసపాటి బాలరాజు (45) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. 2012 బ్యాచ్‌కు చెందిన బాలరాజు బెటాలియన్‌లోని ఆర్మ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అథారిటీ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సెలవుపై స్వస్థలమైన భువనగిరికి వెళ్లాడు. ఇంటివద్ద గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నగరంలోని దవాఖానకు తరలిస్తుండగా అప్పటికే మృతి చెందినట్లు బెటాలియన్ అధికారులు తెలిపారు. బాలరాజు మృతితో బెటాలియన్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.