Bathukamma | తంగేడు.. బంతి.. చామంతి.. ఇలా తీరొక్క పూలతో భాగ్యనగరం మురిసిపోయింది. వివిధ ఆకృతుల్లో తయారు చేసిన బతుకమ్మలు మహిళల కళాభిరుచిని చాటి చెప్పాయి. ‘ఎంగిలిపూల’తో మొదలైన పూల జాతర గురువారం సద్దుల బతుకమ్మతో ముగిసింది.
పోయిరా గౌరమ్మ’.. మళ్లొచ్చే ఏడాదికి తిరిగి రావమ్మ’ అంటూ.. ఆడబిడ్డలంతా బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చారు. మరోవైపు ఉయ్యాల పాటలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు పులకించిపోయాయి. వందలాది మంది మహిళలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ.. ఆడిపాడారు. అనంతరం హుస్సేన్‌సాగర్‌లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.