బేగంపేట, మే 31: బేగంపేట డివిజన్లోని ప్రకాశ్‌నగర్ ఎక్స్టెన్షన్ బస్తీలో కొంతకాలంగా తాగునీటి సరఫరా సరిగ్గా లేకపోవడంతో బస్తీ మహిళలు శుక్రవారం బేగంపేటలోని జలమండలి సెక్షన్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వెంటనే స్పందించిన అధికారులు.. బస్తీలో పర్యటించి సమస్యను గుర్తించారు. రెండు రోజుల్లో పైపులైన్లో ఏర్పడిన సమస్యను పరిష్కరిస్తామన్నారు. అలాగే బస్తీలో 90 శాతం మంది మోటర్లు బిగించి నల్లా నీటిని లాగేస్తుండటంతో మిగతా వారికి లో ప్రెషర్‌తో నీళ్లు వస్తున్నట్టు గుర్తించారు. మోటర్లు బిగించి నీటి చౌర్యానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.