జూబ్లీహిల్స్, అక్టోబర్1: రహ్మత్‌నగర్ డివిజన్లో కాంగ్రెస్ కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. కార్పొరేటర్ సీఎన్ రెడ్డి వర్గంపై ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి తరచూ ఆధిపత్యం ప్రదర్శించేందుకు విఫలయత్నం చేస్తున్నాడు. మంగళవారం బ్రహ్మశంకర్ నగర్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్న అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానికుడైన ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకటస్వామి స్థానిక మహిళలపై తన ప్రతాపాన్ని చూపించాడు. స్థానిక బస్తీ నాయకుల ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న మహిళలపై వీరంగం సృష్టించాడు.
తనకు అడ్డుగా ఉన్నారని ఒక మైనర్‌తో పాటు ముగ్గురు మహిళలపై దాడికి తెగబడడంతో పాటు అతడి అనుచరులతో కలిసి వారి ఇండ్లపై దౌర్జన్యంగా దూసుకెళ్లి మహిళలని చూడకుండా వారిని వివస్త్రలను చేసి విచక్షణ రహితంగా కొట్టారని ఎస్పీఆర్ హిల్స్ ఉమ్మడి బస్తీల నాయకులు ఆరోపించారు. దాడిలో ఈశ్వరమ్మ, రజిత, మీనాక్షి అనే మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు బుధవారం నగరంలోని ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను వారు పరామర్శించారు. మహిళల పై గౌరవం లేని వ్యక్తిని.. తెలంగాణయేతరుడైన వ్యక్తిని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.