Momos Case | బంజారాహిల్స్ మోమోస్ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల మోమోస్ తిని ఒకరు మృతి చెందగా.. పలువురు అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే. చింతల్‌బస్తీలో మోమోస్ తయారు చేస్తున్న అల్మాస్తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోమోస్ తయారీలో నాసిరకం పదార్థాలను వాడినట్లుగా అధికారులు గుర్తించారు. నాసిక, అపరిశుభ్రత కారణంగా మోమోస్ విషపదార్థంగా మారాయని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో వారపుసంతలో అమ్మిన మోమోస్‌ని రేష్మ అనే మహిళ కొనుగోలు చేసి తిన్నది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.
కుటుంబ సభ్యులు రేష్మ మృతికి కల్తీ మోమోస్ కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే మోమోస్ తయారీ కేంద్రాన్ని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అధికారులు చేశారు. మోమోస్ తిని పలువురు అస్వస్థతకు గురవగా.. ఇంకా ఆసుపత్రుల్లో కొందరు చికిత్స పొందుతున్నారు. నిందితులు బిహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. నాసిరకం, అపరిశ్రుభంగా తయారు చేసిన మోమోస్, మయోనైన్ శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. తాజాగా ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు. ఇప్పటికే వ్యవహారంలో మయోనైజ్‌ను ప్రభుత్వం ఏడాది పాటు నిషేధించిన విషయం తెలిసిందే.