రామంతాపూర్, నవంబర్ 25 : ఉప్పల్ నియోజకవర్గంలో శనివారం బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కాలనీల్లో పాదయాత్ర చేస్తూ.. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా హబ్సిగూడ డివిజన్ ,వెంకట్‌రెడ్డినగర్‌లో పాదయాత్ర నిర్వహించి..కారుగుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పాదయాత్రలో బం డారికి ప్రజలు బ్రహ్మరథం పట్టి..మంగళహారతులు ఇచ్చి, వీరతిలకం దిద్దారు. ఈకార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ బీవీ చారి, తదితరులు పాల్గొన్నారు.
కార్తీక పూజల్ల్లో బండారి..
ప్రగతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామంతాపూర్ పూనం భవన్ ఫంక్షన్హాల్లో శనివారం నిర్వహించిన కార్తిక పూజలో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా పలువురు మహిళలు బండారిని ఆశీర్వదించారు.ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్రావుతోపాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.
డివిజన్లోని పలు అపార్టుమెంట్లలో బీఆర్ఎస్ నాయకులు మేకల మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యం లో శనివారం ప్రచారం నిర్వహించారు. శ్రీ సాయి ల్యాండ్ మార్క్ అపార్టుమెంట్లో రాష్ట్ర నేత రాగిడి లక్ష్మారెడ్డి , తదితరులు సమావేశం నిర్వహించి.. బండారి లక్ష్మారెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి.. మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అపార్టుమెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ శర్మ, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి దీపక్‌రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి..
బీఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు డివిజన్లలో తమ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాగిడి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం హబ్సిగూడ డివిజన్లోని ఎస్వీ గ్రాండ్ హోటల్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఓటు మనకు మళ్లించే విధంగా కృషి చేయాలన్నారు. నాయకులు పసుల ప్రభాకర్‌రెడ్డి , లక్ష్మీనారాయణ, సరి తా గౌడ్, సోమిరెడ్డి, దినేశ్, సంజయ్ జైన్ పాల్గొన్నారు.
నాచారంలో ప్రచారం..
నాచారంలో కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి బండా రి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. అదేవిధంగా రామంతాపూర్‌లోని రాజేంద్రనగర్‌లో కార్యకర్తలు ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలన్నా రు. ప్రచారంలో సీమ అశోక్, శ్రీనివాస్, పోకల మహేశ్, జంగయ్య, సత్యనారాయణ, రాకేశ్, వేముల చిన్న కుమా ర్, ప్రశాంత్, శంకర్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
కాప్రా డివిజన్లో..
కాప్రా,నవంబర్ 25 : కాప్రాడివిజన్ పరిధిలోని సాయిరాంనగర్, ఎల్లారెడ్డిగూడ, గోపాల్‌రెడ్డినగర్, వంపుగూడ, ఆర్టీసీ కాలనీ, వలువర్నగర్, నేతాజీనగర్ తదితర కాలనీల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ,బూత్‌కమిటీ సభ్యులు ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కరపత్రాలను పంపిణీ చేస్తూ కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వారు ఓటర్ల కు వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మహిళానేతలు పాల్గొన్నారు.
ఏఎస్‌రావునగర్ డివిజన్లో..
చర్లపల్లి, నవంబర్ 25 : దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పాలన సాగించారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఏఎస్‌రావునగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషాసోమశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ, కమలానగర్ తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
చర్లపల్లి డివిజన్ పరిధిలో..
చర్లపల్లి, నవంబర్ 25 : బీజేపీ, కాంగ్రెస్ పార్టీల హామీలు నమ్మి మోసపోవద్దని, ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. శనివారం చక్రీపురం, తదితర కాలనీల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో నాయకులు బాల్ రెడ్డి, మహేశ్‌గౌడ్, శివకుమార్‌గౌడ్, రాఘవరెడ్డి, కనకరాజుగౌడ్, బొడిగె ప్రభుగౌడ్, నారెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అనిల్, జయకృష్ణ, సురేశ్‌రెడ్డి, జాండ్ల సత్తిరెడ్డి, తాళ్ల వెంకటేశ్‌గౌడ్, లక్ష్మారెడ్డి, యాదగిరి, రమేశ్, రాజుగౌడ్, కడి యాల బాబు,కనకయ్య,ఆనంద్ రాజుగౌడ్ పాల్గొన్నారు.