చర్లపల్లి, నవంబర్ 9 : ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలు పేర్కొన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని ఈసీఐఎల్ చౌరస్తాలో చర్లపల్లి డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్ బొంతు శ్రీదేవిల ఆధ్వర్యంలో నామినేషన్‌కు తరలిన బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో కలిసి అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి.. ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని, ఎన్నికల ప్రచారానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్‌పాల్‌రెడ్డి, నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, నేమూరి మహేశ్‌గౌడ్, కనకరాజుగౌడ్, పాండాల శివకుమార్‌గౌడ్, సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, నారెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, జాండ్ల సత్తిరెడ్డి, బొడిగె రాజుగౌడ్, చెన్నయ్యగౌడ్, కడియాల బాబు, చల్లా వెంకటేశ్, గిరిబాబు, సారా అనిల్, రఫీక్, శ్రీకాంత్‌రెడ్డి, నరేశ్, లక్ష్మారెడ్డి, ఆనంద్రాజుగౌడ్, రెడ్డినాయక్, కొమ్ము సురేశ్, సానెం రాజుగౌడ్, కొమ్ము రమేశ్, ఎంకిరాల న ర్సింహా, రఫీక్, మురళి, పాండు, సోమయ్య, ముత్యా లు, రవి, బాల్‌రాజు, రాధకృష్ణ, పుష్పలత, నవనీత, సత్తెమ్మ, లలితతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.
కాప్రా, నవంబర్ 9 : ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తల జయజయ ధ్వానాల మధ్య సైనిక్‌పురి బీఆర్ఎస్ కార్యాలయం నుంచి గులాబీ దండు వెంటరాగా సైనిక్‌పురి చౌరస్తాలోని జ్యోతిరావుఫులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రైస్తవ మత గురువులు వారి మత సంప్రదాయాల ప్రకారం బీఎల్ఆర్ను ఆశీర్వదించి..గెలువాలని దీవించారు. డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు బీఎల్ఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ, గెలుపు తథ్యమని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజు, బద్రుద్దీన్, మహేందర్‌రెడ్డి, నవీన్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
రామంతాపూర్, నవంబర్ 9 : ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డి నామినేషన్‌కు రామంతాపూర్, హబ్సిగూడ డివిజన్ల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరిలారు. హబ్సిగూడ డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ బీవీ చారి, పసుల ప్రభాకర్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, యాద మ్మ, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, సోమిరెడ్డి, శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్రావు, పాలకూర శ్రీకాంత్ గౌడ్, శాగరవీందర్, సంధ్య ర్యాలీగా వెళ్లారు.
అలాగే.. మల్లాపూర్ చౌరస్తాలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి అభ్యర్థి బండారికి పూల మాల వేసి స్వాగతం పలికారు. అలాగే.. మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్ల్ కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ జి. శ్రీనివాస్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు వంజరి ప్రవీణ్ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాల వేసి నామినేషన్‌కు బయలు దేరారు.