Gangula kamalakar | బండి కొడుకు కేసు కుల సమస్య కాదు.. లా అండ్ ఆర్డర్ సమస్య : గంగుల కమలాకర్
Gangula kamalakar | బీఆర్ఎస్ పార్టీ నేతల ఒత్తిడితోనే కేంద్ర మంత్రి కొడుకుపై కేసు నమోదు చేశారన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ బండి సంజయ్ కొడుకు పోక్సో కేసును కులానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు.
Gangula kamalakar | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ విషయంలో బీఆర్ఎస్ భాధితురాలి పక్షాన ఉందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ నేతల ఒత్తిడితోనే కేంద్ర మంత్రి కొడుకుపై కేసు నమోదు చేశారన్నారు.
బండి సంజయ్ కొడుకు పోక్సో కేసును కులానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కుల సమస్య కాదు. లా అండ్ ఆర్డర్ సమస్య. నిన్న కరీంనగర్ లో బెదిరింపు ధోరణిలో మాట్లాడిన బండి సంజయ్ ఎవరి అంతు చూస్తావ్..? బాధితురాలిని అంతం చేస్తావా, లేకపోతే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను అంతం చేస్తావా..? అని గంగుల ప్రశ్నించారు. చట్టానికి, పోలీసులకు బండి సంజయ్ కుమారుడు సహకరించాలన్నారు.
కాగా బండి సాయి భగీరథ్‌పై ఇప్పటికే పోక్సో కేసు నమోదుచేసిన పోలీసులు.. అతడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాజాగా కొన్ని సెక్షన్లను అదనంగా చేర్చారు. పోక్సో చట్టం సెక్షన్ 5(1) రెడ్ విత్ 6ను జత చేశారని తెలిసిందే. ఇంతకుముందు బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ పోక్సో చట్టం, బీఎన్ఎస్ 74, 75 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును మహిళా ఐపీఎస్ అధికారి రితిరాజ్‌కు అప్పగించిన నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు కులాలకు సంబంధించిన సమస్య కాదు
ఇది లా అండ్ ఆర్డర్‌కు సంబంధించిన సమస్య.. దయచేసి దీనిని కులాలకు అంటగట్టకండి!బాధ్యత గల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్
చట్టానికి, పోలీసులకు సహకరించాలి.. బాధితురాలికి న్యాయం చేయాలి!నిన్న కరీంనగర్ లో… pic.twitter.com/C4u6PFam0J
— BRS Party (@BRSparty) May 13, 2026
Read Also :
Satyavathi Rathod | పబ్బులు, క్లబ్బుల్లో గొడవలప్పుడే బుద్ధి చెప్పాల్సి ఉండే : సత్యవతి రాథోడ్
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అంకిత్
YCP MLC | వైసీసీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

