Stray Dogs | సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో 88.5 శాతం వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసినట్లు సోమవారం బల్దియా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24 సంవత్సరంలో 59,745 వీధి కుక్కలకు శస్త్ర చికిత్సలు నిర్వహించామన్నారు. వీధి కుక్కల నియంత్రణకు హై లెవల్ కమిటీ సూచనల ప్రకారం చర్యలు చేపడుతున్నామని, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు.
మాంసాహార దుకాణాలు, వైద్యశాలలు, హాస్టల్ నిర్వాహకులకు వ్యర్థాల పారబోతపై నోటీసులు జారీ చేశామని, 3263 మందికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. వేసవిలో వీధి కుక్కల సంరక్షణకు ఎన్జీవో సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, 4900 వాటర్ బౌల్స్‌ను వీధి కుక్కల కోసం ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఆదివారం మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి ఆద్రాన్పల్లి జరిగిన కుక్కకాటు ఘటన జీహెచ్ఎంసీ పరిధిలోకి రాదని అధికారులు స్పష్టం చేశారు.