MLA Sudheer Reddy | చంపాపేట, జూలై 2 : చంపాపేట డివిజన్ బైరామాల్ గూడ చెరువు సమీపంలోని కొంత ప్రభుత్వ స్థలంలో గత 30 సంవత్సరాల క్రితం నుంచి పక్కా ఇల్లు నిర్మించుకొని నివాసముంటున్న పేదల ఇండ్లకు ఎలాంటి ఢోకా లేకుండా అండగా ఉంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. పేదల ఇండ్ల కూల్చివేతలపై రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా చేత అనేక ఆంక్షలు పెట్టి కూల్చివేస్తున్న నేపథ్యంలో తమ ఇల్లు కూడా కూల్చివేస్తారేమోనని బైరామాల్ గూడ చెరువు సమీపంలో ఉన్న పేదలు భయాందోళనకు గురవుతున్నారు. తమకు అన్యాయం జరగకుండా చూడాలని బుధవారం ఆ ఇండ్ల పేదలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి విషయం తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఇండ్లు కూల్చి వేయకుండా ఉంటామని పేదలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని వారికి భరోసానిచ్చారు.