చార్మినార్, మార్చి 8: స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని బహదూర్‌పుర నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ పులిపాటి రాజేశ్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని దూద్ బౌలి, అలియాబాద్ గంగపుత్ర సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధిలో వర్గ, మత సంబంధాలు లేకుండా సమ ప్రధాన్యాతతో సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. అలియాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల చాలా కాలంగా తిష్టవేసిన స్థానిక సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. స్థానిక సమస్యలపై అధికారులతో చర్చిస్థానని వెల్లడించారు. అదే సమయంలో స్థానికంగా గంగపుత్రులు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో అలియబాద్ గంగాపుత్ర సంఘం ప్రతినిధులు శ్రీ దార్పాలీ కృష్ణ, ప్రధాన కార్యదర్శి పల్లెలా పుర్షోతం,ఉపాధ్యక్షుడు ఆనందేశి ప్రవీణ్,ఆనందేశి అర్జున్ కుమార్, గుంటి బసంత్ రావు,ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఎ వి జ్ఞానేశ్వర్ తదితరులు ఉన్నారు.