Manikonda | సమీపంలోనే కమర్షియల్ కాంప్లెక్సులు, అపార్ట్మెంట్లు.. కానీ ఆ పక్కన చూస్తే మాత్రం చెత్తాచెదారం, పందుల స్వైర విహారం.. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా..? మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని 127వ వార్డు నెమలి నగర్లో ఈ దృశ్యాలు వెలుగు చూశాయి. నెమలి నగర్లో పందుల స్వైర విహారం, చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వస్తుండటంతో అక్కడి ఏరియా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాగడానికి సమయానికి నీళ్లు రాకపోవడంతో అక్కడి వాసులు సతమతమవుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా స్థానిక అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంపై అక్కడి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పందులు చాలా ఉన్నాయని.. చెత్తను శుభ్రం చేసేందుకు 15 రోజులు, నెలకోసారి మున్సిపల్ అధికారులు వస్తారని స్థానికులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పారిశుద్ధ్యం నిర్వహణలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో ఈ దశ్యాలు చెప్పకనే చెబుతున్నాయి.
మణికొండ మున్సిపాలిటీలోని 127వ వార్డు నెమలి నగర్లో దారుణ దుస్థితి ఇది
పందులు స్వైర విహారం చేస్తూ, చెత్తా చెదారం నిండిపోయి దుర్వాసన వెదజల్లుతూ దారుణ పరిస్థితి
తాగడానికి నీళ్లు సమయానికి రాక పరిస్థితి దారుణంగా ఉన్నా పట్టించుకోని అధికారులు pic.twitter.com/Wop0lKM9Zn
— Telugu Scribe (@TeluguScribe) January 31, 2026
Sangareddy | రేపే పశువుల జాతర.. 359 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఉత్సవం గురించి తెలుసా!
Harish Rao | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం : మాజీ మంత్రి హరీష్ రావు