బన్సీలాల్‌పేట్, ఏప్రిల్ 5 : షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో బన్సీలాల్‌పేట్‌లో బుధవారం మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ 116వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అంబేద్కర్, జగ్జీవన్రామ్ల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. దళితులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తున్నదని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పేద దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ‘దళితబంధు’ పథకం అమలుచేస్తున్నదని అన్నారు. ఒక్కో కుటుంబానికి పది లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని, ఆయన నిజమైన దళిత ఆత్మబంధువుగా నిలిచారని తెలిపారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు నామకరణం చేయడం, 125 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు చేయడం దేశంలోనే రికార్డుగా నిలిచిందని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, ఎస్సీఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు ఆర్.నాగేశ్వర్రావు, రాష్ట్ర అధ్యక్షుడు డి.సుదర్శన్‌బాబు, మహేందర్, అశోక్, గోవర్దన్, బీఆర్ఎస్ నాయకులు జి.పవన్‌కుమార్ గౌడ్, కె.లక్ష్మీపతి, వెంకటేశన్ రాజు, కమల్‌కుమార్, ప్రేమ్‌కుమార్, జ్ఞాని, ఫహీమ్, పురుశోత్తం, సాయిబాబా, కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
బాలంరాయ్ చౌరస్తాలో..
కంటోన్మెంట్/మారేడ్‌పల్లి, ఏప్రిల్ 5: బాలంరాయ్ చౌరస్తాలోని జగ్జీవన్‌రామ్ విగ్రహానికి మంత్రి మల్లారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యాక్షుడు జంపన ప్రతాప్, నాయకులు డీబీ.దేవేందర్, పరుశురామ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రా్రష్ట్ర కార్యాలయంలో…
సీపీఐ రా్రష్ట్ర కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి సీపీఐ జాతీయ కార్యదర్శి బినయ్ విశ్వం, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ పూలమాలవేసి నివాళులర్పించారు. డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్, తదితరులు పాల్గొన్నారు.
జలమండలి ప్రధాన కార్యాలయంలో..
ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎండీ దానకిశోర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ నాయకులు జలమండలి ప్రధాన కార్యాలయం నుంచి ఎల్బీ స్టేడియం వద్దనున్న జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలమండలి డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, శ్రీధర్‌బాబు, వీఎల్ ప్రవీణ్‌కుమార్, రవికుమార్, స్వామి, కార్యక్రమం కో ఆర్డినేటర్, సీజీఎం విజయరావు, సీజీఎంలు వినోద్ భార్గవ, అమరేందర్ రెడ్డి, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.
మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద
మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ మేడి పాపయ్య మాదిగ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు బట్టు దాసురావు మాదిగ, కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మి మధుసూధన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ తీగల సునరితాఅజిత్రెడ్డి, బీఆర్ఎస్ గ్రేటర్ అడహక్ కమిటీ సభ్యులు, జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షుడు బాబు సుదర్శన్, డివిజన్ ప్రధాన కార్యదర్శి చుక్క కృష్ణ, సంరెడ్డి సురెందర్‌రెడ్డి, బొక్క మధుసూదన్‌రెడ్డి, దళిత సంఘాల నాయకులు, తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.
బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జయంతి ఉత్సవాల కమిటీ ఏర్పాటు చేసిన ఉత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. సంఘటితంగా ఉంటే ఎంతటి సమస్యలకైనా పరిష్కారం లభిస్తుందని అన్నారు. దేశంలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యంకావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అంబేద్కర్, జగ్జీవన్రామ్ల స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు కొమ్ముల నరేందర్, మేడి పాపయ్యమాదిగ, జంగా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో…
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ జియావుద్దీన్, అడిషనల్ కమిషర్లు వి.కృష్ణ, విజయలక్ష్మి, సరోజ, యాదగిరి రావు, ఎస్ఈ కోటేశ్వర్ రావు, అకౌంట్ చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, సీపీఆర్వో మొహమూద్ ముర్తుజా, సెక్రటరీ లక్ష్మి, జాయింట్ కమిషనర్ సంధ్య, ఓఎస్డీ అనురాధ, ఏఎంసీ జీవన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.