సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్‌లోని వాణిజ్య సముదాయాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని తేలితే సంబంధిత వాణిజ్య సముదాయాలను సీజ్ చేస్తామని జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం అడిషనల్ కమిషనర్ ప్రకాశ్‌రెడ్డి హెచ్చరించారు. ఆసుపత్రులు, సూపర్ మార్కెట్లు, మాల్స్, థియేటర్స్, కోచింగ్ సెంటర్లకు సంబంధించి ప్రతి యాజమాని ఫైర్ రూల్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. రెండో రోజు మంగళవారం ఈవీడీఎం కార్యాలయంలో విద్యాసంస్థలు, దవాఖానలు, వాణిజ్య వ్యాపారస్తులతో కలిసి ‘అగ్ని ప్రమాదాల ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ ఎన్ఓసీ, ఫైర్ సేఫ్టీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రకాశ్ రెడ్డి వివరించారు. మాల్స్, మల్టీఫ్లెక్స్, ఇతర వాణిజ్య ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. స్కూల్ పిల్లలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నామని, అయితే ఫైర్ సేఫ్టీపై ఒక సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం ఉన్నదన్నారు. 27 ప్రాంతాల్లో ఈవీడీఎం వాహనాలు ఉన్నాయని, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే వారు అక్కడికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 15 మీటర్ల కంటే తక్కువ ఉన్న వాణిజ్య భవనాలకు ఈవీడీఎం ఫైర్ ఎన్ఓసీ ఇస్తున్నట్లు తెలిపారు. చట్ట ప్రకారమే బ్యానర్స్, పోస్టర్స్, వాల్ రైటింగ్‌కు జరిమానాలు విధిస్తున్నట్లు ప్రకాశ్ రెడ్డి తెలిపారు. పార్కింగ్ ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.
ప్రమాదాల సమయంలో