బంజారాహిల్స్, ఫిబ్రవరి 28: ప్రపంచంలోని ప్రతి జీవరాశికి ప్రాణం ఉంటుందని, అవన్నీ నొప్పిని అనుభవిస్తాయని, మాంసాహారం తినడం అంటే నోరులేని మూగజీవాలను హింసించడమే అని అన్నారు. పెటా ఇండియా ప్రతినిధులు శుక్రవారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కువద్ద వినూత్న రీతిలో అవగాహన నిర్వహించారు.
గో వెగాన్ నినాదంతో పార్కు వద్ద పెటా ఇండియా ప్రతినిధులు చేపల వేషధారణతో వాటిలో కలిగే బాధను, భయాన్ని ప్రదర్శించారు. చేపలు కూడా మనిషిలాగే నొప్పిని అనుభవిస్తాయని, ఊపిరి ఆడకుండా చేసి వాటిని చంపి తినడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ జీవహింసకు తావులేని శాఖాహారులుగా మారాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.