కుత్బుల్లాపూర్, జూలై 3: కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ ఫస్ట్ అవెన్యూ కాలనీ వాసులు మల్కాజిగిరీ ఎంపీ ఈటల రాజేందర్‌ను కోరారు. తమ కాలనీలో 200 గజాల స్థలం ఖాళీగా ఉన్నదని, అందులో కాలనీవాసుల అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కావాల్సిన నిధులను సమకూర్చాలని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాలనీ ఏర్పాటు సమయంలో అవసరాల కోసం కేటాయించిన 200 గజాల స్థలంలో కాలనీలో వివిధ కార్యక్రమాలకు, చిన్నారులు, వృద్ధులకు సామాజిక భవనం నిర్మాణం అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఎంపీని కలవగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు మధు గౌడ్, నాగల్ రెడ్డి, నాగేశ్వరరావు, రామ్ రెడ్డి, ధనుంజయ రావు, కిషోర్, భరత్, విజయ్ కుమార్, నర్సింగ్ రావు, శ్రీనివాస్, అఫ్రైజ్, జలరామ్ దేవసి , హమీరా రామ్ దేవాసి, దామోదర్, ఆనంద్ కుమార్, రమణ తదితరులు పాల్గొన్నారు