Turkayamjal | తుర్కయంజాల్, మార్చి 19 : బస్ బేలను సాధారణంగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సును ఎక్కడానికి, దిగడానికి వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే పలు చోట్ల బస్ బేలను ఆటోలు అక్రమిస్తుండడంతో బస్సులను నడ్డిరోడ్డులో నిలపాల్సిన పరిస్థితి వస్తుంది.
నడ్డిరోడ్డులో బస్సులను నిలుపుతుండడంతో ప్రయాణికులు సైతం బస్సులను ఎక్కడానికి, దిగడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ముఖ్యంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ చౌరస్తాలోని బస్ బేలో నిత్యం ఆటోలే ఉంటుండడంతో ఆర్టీసీ బస్సులను సాగర్ ప్రధాన రహదారి మధ్యలో ఆపుతున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటుగా సాగర్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ట్రాఫిక్ పోలీసులు సైతం పట్టించుకోకపోవడంతో ఆటో డ్రైవర్లు నిత్యం ఆటోలను బస్ బేలలోనే నిలుపుతున్నారని ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరతున్నారు.