Auto Drivers | తెలంగాణ ఆటో జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో రెండో రోజు గురువారం ఆటో డ్రైవర్ల నిరసన కొనసాగింది. బీఎంఎస్ అనుబంధ సంస్థ తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నగరంలోని ఉప్పల్, నాచారం, ఈసీఐఎల్ తదితర ప్రాంతాల్లో భిక్షాటన చేపట్టి.. తాము పడుతున్న కష్టాలను ప్రజలకు వివరించారు.
ఉచిత బస్సు పథకం ఆటో డ్రైవర్ల జీవితాల్లో చీకట్లు నింపిందని.. ఆదుకోవాల్సిన సర్కార్ చోద్యం చూస్తున్నదని విమర్శించారు. ఏడాదికి రూ. 12వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు..ఇప్పటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. పోరాటం ఉధృతం చేసి కాంగ్రెస్ మోసపూరిత ని ఎండగడుతామని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు. ఈ నిరసనలో బీపీటీఎంఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హబీబ్, గిరి, ప్రతాప్, నారాయణ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
– సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ)