మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాల్సిందే
ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
- ఆటో డ్రైవర్స్ జేఏసీ
హిమాయత్‌నగర్: ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయకుండా ఆటో డ్రైవర్లు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదర్‌గూడలోని ఎన్ ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రైవేట్ ఫైనాన్సియర్ల వద్ద రుణాలు తీసుకొని ఆటోలను కొనుగోలు చేసుకున్న ఆటో డ్రైవర్లు స్వయం ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారన్నారు. మూడు నెలలుగా గిరాకీ లేకపోవడంతో రాష్ట్రంలో ఉన్న 7లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయన్నారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమైన ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ.12వేలు, ఈఎస్ఐతో పాటు ఆటో, మోటారు రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

