బంజారాహిల్స్,అక్టోబర్ 1: ఆటోలో గ్యాస్ నింపుకుని వస్తానంటూ ఇంట్లోంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఫిలింనగర్‌లోని ఎంఆర్సీ కాలనీలో నివాసం ఉంటున్న కే.చంటి(44) అనే వ్యక్తి ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతడి భార్య రామలక్ష్మి ఇండ్లలో పనిచేస్తుంటుంది. ప్రతిరోజూ తాను బయటకు వెళ్లే సమయంలో భార్యను పని వద్ద డ్రాప్ చేస్తుంటాడు.
ఇదే క్రమంలో గత నెల 25న ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఆటోలో గ్యాస్ ఫిల్ చేసుకుని వస్తానంటూ భయటకు వెళ్లిన చంటి ఇంటికి తిరిగి రాలేదు. బంధువుల ఇండ్లతో పాటు సొంతూర్లో సైతం గాలించగా ప్రయోజనం లేకపోవడంతో భార్య రామలక్ష్మి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతడి ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాలని ఫిలింనగర్ పోలీసులు తెలిపారు.