Inter | ఖైరతాబాద్, జూన్ 1 : ఖైరతాబాద్కు చెందిన ఓ విద్యార్ధిని ఇంటర్ ఒకేషనల్ కోర్సులో ప్రతిభ చాటింది. ఖైరతాబాద్ డబుల్ బెడ్రూంలో నివాసం ఉండే ఆటోడ్రైవర్ సురేశ్ కుమార్, లక్ష్మి దంపతుల కుమార్తె తేజస్విని శంకర్పల్లి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఇంటర్ (ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్) ఒకేషనల్ కోర్సులో వెయ్యికి 992 మార్కులతో రాష్ట్ర మొదటి ర్యాంకు సాదించింది. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూ గృహ సముదాయంలో 2బీహెచ్కే డిగ్నీటి హౌజింగ్ సొసైటీ అధ్యక్షులు డీబీ అనిల్ కుమార్ రూ.10వేల చెక్కున అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి విజయ్, ఉపాధ్యక్షులు వెంకటేశ్, యాదగిరి, అశోక్, సాయి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.