హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్ వద్ద ఆటో డ్రైవర్ (Auto Driver) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటోను రోడ్డు పక్కన నిలిపి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతుడిని టోలీచౌకికి చెందిన షాదిఫ్(28)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఆటో ఈఎంఐ చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నది.