హైదరాబాద్ : గచ్చిబౌలిలో సోమవారం అర్ధరాత్రి ఓ యువతిపై ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ కెమెరాల ఫుటేజీ, సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా కేసును పోలీసులు ఛేదించారు. లైంగికదాడికి పాల్పడిన ఆటో డ్రైవర్ ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు. ప్రవీణ్‌ను శేరిలింగంపల్లి గోపీనగర్లో అదుపులోకి తీసుకున్నారు. ప్రవీణ్ నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి వాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, సైబరాబాద్ ఐటీ కారిడార్ మంగళవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత సేఫ్‌జోన్‌గా భావించే గచ్చిబౌలిలో సోమవారం అర్ధరాత్రి ఓ యువతిపై ఆటో డ్రైవర్, తన స్నేహితుడితో కలిసి లైంగికదాడి చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన పోలీస్‌శాఖ పనితీరుపై మరోసారి విమర్శలకు తావిచ్చింది.