సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): భారతదేశంలో సుప్రసిద్ధమైన ఆభరణాల సంస్థ జోస్ ఆలుక్కాస్ వివాహ వేడుకల కొనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లతో శుభమాంగళ్యం వివాహ ఆభరణాల ఉత్సవాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. బంగారం కొనుగోళ్లపై అంతే బరువుగల వెండిని ఉచితంగా అందిస్తోంది. పాత బంగారం ఎక్స్ఛేంజ్పై అధిక లాభం వచ్చేలా అందిస్తుంది.
తరుగు మీద బంగారు ఆభరణాలకు 30 శాతం తగ్గింపును, వజ్రాలకు 25 శాతం తగ్గింపును కూడా జోస్ ఆలుక్కాస్ అందిస్తుంది. ప్లాటినమ్ ఆభరణాల తరుగు మీద 15 శాతం తగ్గింపు ఉంటుంది. వెండి ఆభరణాలు ఎటువంటి తరుగు లేకుండా లభిస్తాయని గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కాస్ తెలిపారు. కస్టమర్ల కోసం ఎల్లప్పుడూ నూతన ఆఫర్లను తీసుకువస్తూనే ఉంటామన్నారు.