బంజారాహిల్స్, నవంబర్ 19 : నో పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేసిన బైక్‌ను ఫొటో తీశాడన్న కోపంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 12లో బుధవారం ఉదయం విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సాయి మనోహర్ రోడ్డుపక్కన నో పార్కింగ్‌లో ఉన్న బైక్ కనిపించింది.
బైక్‌ను ఫొటో తీయడంతో అక్కడకు వచ్చిన బైక్ యజమాని సయ్యద్‌నగర్‌కు చెందిన ఇబ్రహీం ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో ఇబ్రహీం కోపంతో సాయి మనోహర్‌పై దాడికి యత్నించడంతో పాటు తోసేయడంతో కిందపడిపోవడంతో కాలికి గాయమయింది. ఈ మేరకు ట్రాఫిక్ కానిస్టేబుల్ సాయి మనోహర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.