హైదరాబాద్ : మద్యానికి(Alcohol) బానిసై డబ్బుల కోసం స్నేహితుడిపై కత్తితో దాడి(Attack) చేశాడు ఓ యువకుడు. ఈ విషాదకర సంఘటన టపాఛబుత్ర(Tapachhabutra) పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మద్యానికి రూ.100 ఇవ్వలేదని సల్మాన్ అనే యువకుడు తన స్నేహితుడు షరీఫ్ పై కత్తితో తలపై దాడి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.