Gadwal Accident | జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై టెన్త్ పఠాలం ఎదురుగా ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను మౌనిక, సాయికుమార్‌గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని ముఖేశ్గా గుర్తించారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ యాక్సిడెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం అతి వేగమా? డ్రైవర్ నిర్లక్ష్యమా? ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.