Chiranjeevi | ‘జగమే సంగీతం’పై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ.. సుష్మిత కొణిదెలపై ప్రశంసల వర్షం!
Chiranjeevi | మ్యూజిక్, ఎమోషన్స్‌ను మేళవిస్తూ తెరకెక్కిన కొత్త మ్యూజికల్ వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రకాష్ రాజ్, మేక శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుష్మిత శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మెగా డాటర్ సుష్మిత కొణిదెల నిర్మించారు.
Chiranjeevi | మ్యూజిక్, ఎమోషన్స్‌ను మేళవిస్తూ తెరకెక్కిన కొత్త మ్యూజికల్ వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రకాష్ రాజ్, మేక శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుష్మిత శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మెగా డాటర్ సుష్మిత కొణిదెల నిర్మించారు. సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌ను చూసిన మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘జగమే సంగీతం’ సిరీస్ తనకు ఎంతగానో నచ్చిందని చిరంజీవి తెలిపారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిరీస్‌ను చూశానని, ఎంతో ఆస్వాదించానని చెప్పారు.
ముఖ్యంగా ఇది ఒక అందమైన మ్యూజికల్ డ్రామాగా ఆయన అభివర్ణించారు. సిరీస్‌లోని నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ, హృదయాన్ని తాకే సంగీతం తనను ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. మ్యూజిక్‌ను కథలో భాగంగా మలిచిన తీరు బాగుందని, మొత్తంగా సిరీస్‌ను ఎంజాయ్ చేశానని చిరంజీవి పేర్కొన్నారు. ‘కుమారి 21 ఎఫ్’, ‘18 పేజెస్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ‘జగమే సంగీతం’తో వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిభను కూడా చిరంజీవి ప్రత్యేకంగా ప్రశంసించారు. సూర్య ప్రతాప్ ఒక అద్భుతమైన, ఆసక్తికరమైన సంగీత ప్రపంచాన్ని సృష్టించారని కొనియాడారు. దర్శకుడిగా తన తొలి వెబ్ సిరీస్‌తోనే మంచి ప్రయత్నం చేశారని అభినందించారు.
కర్ణాటక సంగీతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మ్యూజికల్ డ్రామా.. సాధారణ వెబ్ సిరీస్‌లకు భిన్నమైన అనుభూతిని అందించేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.సిరీస్‌లో నటించిన ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అక్షయ్ లగుసాని, సుష్మిత శెట్టి, మధుబాల తమ పాత్రల్లో అద్భుతంగా నటించారని చిరంజీవి ప్రశంసించారు. కథకు తగ్గట్టుగా ప్రతి నటుడు తన పాత్రకు న్యాయం చేశారని, వారి నటన సిరీస్‌కు మరింత బలాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ‘జగమే సంగీతం’ను నిర్మించిన సుష్మిత కొణిదెలపై కూడా చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఇంత చక్కటి సిరీస్‌ను రూపొందించినందుకు సుష్మిత కొణిదెలతో పాటు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ టీమ్ పట్ల గర్వంగా ఉందని తెలిపారు. సరికొత్త కథను, సంగీతాన్ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేసిన మొత్తం టీమ్‌కు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ‘జగమే సంగీతం’కు మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ప్రశంసలు ఇప్పుడు సిరీస్‌పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

