జూబ్లీహిల్స్, అక్టోబర్10: దివంగత ఎమ్మెల్యే మాంగటి గోపినాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మత సామరస్యానికి ప్రతీకగా నిలిపారని.. ఆ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ గోపన్న పేరు నిలబెట్టాలని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ కోరారు. శుక్రవారం యూసుఫ్‌గూడ వెంకటగిరిలోని మహమ్మదీయ మసీద్‌లో ప్రార్థనల అనంతరం కుమార్తె మాగంటి అక్షరతో కలిసి మైనార్టీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. ప్రతిఒక్కరిని ఆత్మీయంగా పలుకరించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాగంటి గోపినాథ్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని మాగంటి మాకు అండగా ఉన్నట్లుగా మేము కూడా ఎన్నికల్లో మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవా రెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, శుభప్రద్ పటేల్, సతీష్ రెడ్డి, టీహెచ్.రమేష్, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కుమారుడు ఆజం అలీతో కలిసి స్థానిక కాలనీల్లో మాగంటి సునీత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంతోష్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ నర్సింగ్‌దాస్, ముస్లిం మతపెద్దలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బాలానగర్, అక్టోబర్ 10: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఓల్డ్‌బోయిన్‌పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ అన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే, ఎర్రగడ్డ డివిజన్ ఇన్చార్జి మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. నేతాజీనగర్ మసీద్ వద్ద మైనారర్టీలను కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు.. మహ్మద్ సలీం, మహ్మద్ అజీమ్, మహ్మద్ అజర్, ముస్తాక్, కర్రె జంగయ్య, సయ్యద్ ఎజాజ్, ఇర్ఫాన్, హరినాథ్, దినేశ్, షర్పు, సోఫీ నాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్, అక్టోబర్ 10: హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని మాజీ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్‌లో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వెంగళరావునగర్,అక్టోబర్ 10: జూబ్లీహిల్స్ గడ్డపై మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పెద్ద కుమార్తె మాగంటి అక్షర.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం వెంగళరావునగర్ డివిజన్ జవహర్‌నగర్‌లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన తండ్రి మాగంటి గోపీనాథ్ ఆశయాలు నెరవేర్చేందుకు తన తల్లి సునీతను గెలిపించాలని ఓటర్లను కోరారు.
బంజారాహిల్స్, అక్టోబర్ 10: మోసకారి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చిత్తుగా ఓడించాలని రహ్మత్‌నగర్ డివిజన్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు కోరారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా శుక్రవారం రహ్మత్‌నగర్ డివిజన్లోని పలు బస్తీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు.. కేఎన్.రెడ్డి, లియాకత్ అలీ, వినోద్, సురేందర్ తదితరులు ఉన్నారు.