ఘట్కేసర్ రూరల్, ఫిబ్రవరి 11 : క్రీడాకారులను ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు సహకారం అందిస్తామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని కాచవాని సింగారంలో మల్లారెడ్డి క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం మంత్రి బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. క్రమశిక్షణ, పట్టుదల కలిగి ఉన్న ప్రతి క్రీడాకారుడికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే క్రీడాకారులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు భద్రారెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ఘట్కేసర్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు దయాకర్ రెడ్డి, కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి, కొండల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.