ఏడాదికి పైగా నల్లా బిల్లులు చెల్లించట్లేదా..? అయితే మీ నీటి కనెక్షన్ కట్..!
Jalamandali | ఏడాది కాలం, ఆపై నుంచి నల్లా బిల్లు చెల్లించని నాన్ డొమెస్టిక్, నాన్ ఫ్రీ వాటర్ కనెక్షన్ల బకాయిలను వసూలు చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. నల్లా బిల్లులు
హైదరాబాద్ : ఏడాది కాలం, ఆపై నుంచి నల్లా బిల్లు చెల్లించని నాన్ డొమెస్టిక్, నాన్ ఫ్రీ వాటర్ కనెక్షన్ల బకాయిలను వసూలు చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. నల్లా బిల్లులు చెల్లించకపోతే.. అలాంటి కనెక్షన్లను తొలగించాలని ఆదేశించారు.
ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి ఓఅండ్ఎం, రెవెన్యూ, ఎంసీసీ, సింగిల్ విండో తదితర అంశాలపైన అధికారులతో గురువారం ఎండీ దానకిశోర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మెట్రో కస్టమర్ కేర్‌కి వచ్చే ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిషరించాలని ఎండీ పేరొన్నారు. ముఖ్యంగా కలుషిత నీరు, సీవరేజి ఓవర్ ఫ్లో, మిస్సింగ్ మ్యాన్ హోళ్లపై వచ్చే ఫిర్యాదుల పరిషారానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. అలాగే బకాయిల వసూలుపైనా అధికారులు దృష్టి సారించాలని ఎండీ సూచించారు.
నాన్ డొమెస్టిక్, నాన్ ఫ్రీ వాటర్ సీమ్ కనెక్షన్ల నుంచి బకాయిలు వసూలు చేయాలన్నారు. దీర్ఘ కాలికంగా బకాయిలు చెల్లించడంలో మొండికేస్తున్న వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. స్పందించని పక్షంలో వారి కనెక్షన్ తొలగించాలని స్పష్టం చేశారు. అయితే డొమెస్టిక్ స్లమ్ వినియోగదారులను బిల్లు చెల్లింపు కోసం ఒత్తిడి చేయకూడదని సూచించారు. కొత్త క నెక్షన్ల కోసం వ చ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే మంజూరు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ, ఆపరేషన్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్ డైరెక్టర్-2 స్వామి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

