బంజారాహిల్స్,నవంబర్ 8: ప్రేమిస్తున్నానని నమ్మించి బాలికను లోబర్చుకోవడంతో పాటు లైంగికదాడికి పాల్పడిన ఆటోడ్రైవర్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్కు చెందిన బాలిక(17)కు లంగర్ హౌజ్‌లో నివాసం ఉంటున్న ఆటోడ్రైవర్ శ్యామ్ (25) అనే యువకుడు మూడేళ్ల క్రితం పరిచయం అయ్యాడు.
ప్రేమిస్తున్నానని బాలికను నమ్మించిన శ్యామ్ పలుమార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న బాలిక తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.