మెహిదీపట్నం,జూలై 12: తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. లంగర్‌హౌస్ చౌరస్తాలో గోల్కొండ కోట బోనాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఆషాఢ మాసం తొలి బోనాన్ని లంగర్‌హౌస్‌లో ప్రారంభిస్తారు.
తొలుత అమ్మవారికి బంగారు బోనం,పట్టువస్ర్తాలను సమర్పిస్తారు. అనంతరం తొట్టెలను గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగించి అమ్మవారికి సమర్పిస్తారు.