ఆశల పోరుబాట
ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..
- ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ..నిరసన
సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ.18 వేల ఫిక్డ్స్ వేతనం చెల్లించాలని, రూ.5 లక్షల జీవిత బీమా కల్పించాలని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని లేదంటే డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని వెల్లడించారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు పారితోషికాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలని కోరారు. ప్రతి ఆదివారం, పండుగలకు ప్రభుత్వ ఉద్యోగులుగా మాదిరిగానే 20 రోజుల క్యాజువల్, ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్, ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. ఏఎన్ఎం, జీఎన్ఎం ట్రైనింగ్ చేసిన ఆశాలకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని కోరారు. 2వ పీఆర్సీలో ఆశా వర్కర్లకు రూ.30 వేల కనీస వేతనం నిర్ణయించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 2 డీఏలు ఆశలకు వర్తింపజేయాలన్నారు. అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చుకుంటే నిరవధిక సమ్మె నోటీసు జారీ చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

