చదువులు చెప్పే సమయమేది?
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే జిల్లాలో టీచర్లలేమి విద్యార్థుల చదువులపై ప్రభావం పడుతున్నది.
- వివిధ పథకాల కార్యక్రమాలతో పాఠాలు చెప్పే టైమ్ ఉండటం లేదంటున్న టీచర్లు
- సమస్యలు పట్టించుకోకసెలవులపై నిఘా
- ఉపాధ్యాయుల అభ్యంతరం
- టీచర్లు వర్సెస్ కలెక్టర్
- ప్రభుత్వ ప్రోగ్రామ్‌ల నిర్వహణ,
- యాప్‌ల్లో వివరాల ఎంట్రీతో అదనపు భారం
సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)..హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే జిల్లాలో టీచర్లలేమి విద్యార్థుల చదువులపై ప్రభావం పడుతున్నది. ఇలాంటి పరిస్థితిల్లో కేంద్ర, రాష్ట ప్రభుత్వాల వివిధ పథకాల్లో భాగంగా రకరకాల కార్యక్రమాలు, యాప్‌లు, పథకాల వీడియోలు వీక్షించడం వంటి అంశాలు ఉపాధ్యాయులకు అదనపు భారంగా మారాయి.
వారంలో 4 రోజులు విద్యార్థులకు సంబంధించిన వివరాలను యాప్‌ల్లో అప్లోడ్ చేయడం, వివిధ కార్యక్రమాలను నిర్వహించడం లాంటివి చేస్తున్నామని, పాఠాలు చెప్పే సమయం ఉండటం లేదని పలువురు టీచర్లు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, యాప్‌ల నిర్వహణ లాంటివి పర్యవేక్షించడానికి అదనపు సిబ్బందిని నియమించుకోకుండా ఆ బాధ్యతలు పాఠాలు చెప్పేవారిపై వేయడం సరైనది కాదని ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు సిలబస్ పూర్తి చేయడం మరోవైపు వివిధ కార్యక్రమాల వివరాల సేకరణ నిర్ణీత సమయంలోపున చేయడం లాంటివి టీచర్లను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. కొన్ని స్కూల్లో సిలబస్ పూర్తి చేయడానికి అదనపు తరగతులు నిర్వహించి వేగంగా పాఠాలు ముగించేస్తున్నారు. దీంతో విద్యార్థులు ఒకేసారి నిబంధనలకు విరుద్ధంగా చెప్పే పాఠాలు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఇటువంటి సమస్యలను పట్టించుకోవాల్సిన కలెక్టర్.. టీచర్ల సెలవులపై నిఘా ఉంచాలనుకోవడం సరైంది కాదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అడిషనల్ కలెక్టర్ నిఘా..?
ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూల్లో టీచర్ల సెలవులు సంబంధి ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షిస్తారు. ఇకపై అడిషనల్ కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేస్తూ కలెక్టర్ ప్రియాంక అలా ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. కలెక్టర్ నిర్ణయంపై టీచర్లు విస్మయం వ్యక్తం చేశారు. అందులో భాగంగా సోమవారం కలెక్టర్‌ను హెచ్టీపీఎఫ్ ఆధ్వర్యంలో టీచర్లు కలిశారు. తమ సెలవులను ఏకీకృతం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ ఆదేశాలు రద్దు చేయాలంటే టీచర్లు అనధికార సెలవుల్లో ఉండకూడదని, సమయానికి పాఠశాలకు రావాల్సిందేనని తెలిపినట్టు చెప్పారు.
కొందరు టీచర్లు పాఠశాలకు వచ్చి హాజరువేసుకొని వెళ్తున్నారని, స్కూల్లో ఉండాల్సిన సమయం అంతా బయట ఉంటున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ పరిస్థితుల్లో కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు టీచర్లు సమర్థిస్తున్నా మరికొందరు వ్యతిరేకిస్తుండటం గమనార్హం. మరోవైపు పాఠశాలకు రావాల్సిన గ్రాంట్లు రావడం లేదని టీచర్లు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నట్టు తెలిసింది. యూనిఫాం, పుస్తకాలు కూడా కొన్ని స్కూల్లో ఇంకా రాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

