ఓయూలో కరెంట్, నీళ్లు బంద్
ఉస్మానియా యూరివర్సిటీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేల మంది విద్యార్థులు, నిరుద్యోగులకు ఆశ్రయమిచ్చే ఈ1, ఈ2, డీ హాస్టళ్లను కూల్చివేయాలని చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
- విద్యార్థుల మౌనదీక్ష..
- అడ్డుకున్న పోలీసులు
ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలు హాస్టళ్లకు నీటి, విద్యుత్ సరఫరా నిలిపివేసి, వాటిని కూల్చాలని ప్రయత్నిస్తున్న అధికారుల వైఖరికి నిరసనగా విద్యార్థులు ఓయూ పరిపాలనా భవనం ముందు మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనకు దిగిన వారిని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 16: ఉస్మానియా యూరివర్సిటీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేల మంది విద్యార్థులు, నిరుద్యోగులకు ఆశ్రయమిచ్చే ఈ1, ఈ2, డీ హాస్టళ్లను కూల్చివేయాలని చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మౌన దీక్షతో నిరసన తెలిపిన విద్యార్థులు.. ఆ హాస్టళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వివిధ విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
వేలమంది విద్యార్థులకు నగరంలో ఆశ్రయమిస్తున్న ఇటువంటి హాస్టళ్లను కూల్చాలనుకోవడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులపై కక్ష కట్టి ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు ఉద్యోగాలను భర్తీ చేయకుండా, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా, నిరుద్యోగ భృతి మంజూరు చేయకుండా ఇప్పటికే నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్న రేవంత్రెడ్డి తాజాగా వారికి నగరంలో నిలువ నీడ లేకుండా చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న వర్సిటీ అధికారులు.. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవడమేమిటని విద్యార్థులు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు తమ నిర్ణయాన్ని పునర్ సమీక్షించుకోవాలని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులై సరైనణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఓయూకు ప్రకటించిన వెయ్యి కోట్లు ముందుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు
విద్యార్థులకు మరో హాస్టల్ కేటాయించాం: ఓయూ అధికారులు
ఆ హాస్టల్ విద్యార్థులకు గత నెలలోనే మరో హాస్టల్ కేటాయించామని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. వందేండ్లకు పైబడిన ఆ హాస్టళ్లలో ప్రస్తుతం అధికారికంగా వర్సిటీ విద్యార్థులెవరూ ఉండడం లేదని స్పష్టం చేశారు. పోలీసుల తనిఖీలో సైతం బయటి వ్యక్తులు ఆ హాస్టళ్లలో తిష్టవేశారని తేలిందన్నారు. బయటి వ్యక్తులే ఆందోళనలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల మౌలిక వసతులు సరిగా లేవంటూ దాదాపు 150 మంది విద్యార్థులు రాష్ట్రపతి, గవర్నర్లకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని చెప్పారు. దాంతో ప్రభుత్వ ఆదేశాలతో వారికి వేరే హాస్టల్ కేటాయించామని వివరించారు. వర్సిటీ అధికార యంత్రాంగంపై బయటి వ్యక్తులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

